
ఈరోజు (గురువారం) రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక.. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. దక్షిణ, మధ్య, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది.
గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
