తెలంగాణలో ప్రభుత్వ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్‌శాఖలో పని చేస్తున్న 105 మంది అధికారులను బదిలీ చేస్తూ పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల్లో జడ్పీ సీఈవోలు, డెప్యూటీ సీఈవోలతో పాటు జిల్లా పంచాయతీ అధికారులను బదిలీ అయ్యారు.
సొంత జిల్లాల్లో పని చేస్తున్న వారితో పాటు మూడేళ్లకుపైగా ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
మరోవైపు పంచాయతీరాజ్‌శాఖతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 14 మంది జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులను బదిలీ చేస్తూ ఎక్సైజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి:విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్
