కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఫైర్ అయ్యారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో రాహుల్ రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తున్నారని విమర్శించారు. రాహుల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు.
Also Read.. చైనా సైనికుల నోట ‘జై శ్రీరామ్’ నినాదాలు
ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాం రాష్ట్రంలో కొనసాగుతున్నది. మోరెగావ్ జిల్లాలో నిర్వహించే పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. అయినా రాహుల్‌గాంధీ పాదయాత్రకు వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రాహుల్‌పై కేసు నమోదు చేయాలని సీఎం హిమంత ఆదేశించారు.
