
ఎంపీ రాహుల్ గాంధీని టార్గెట్ చేయడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజల సమస్యలపై నిలబడే ప్రతిపక్షాలను భయపెట్టడానికే మోదీ ఇలా చేశారన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని విమర్శించారు. హైకోర్టును ఆశ్రయించాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారని కవిత తెలిపారు. తన విఫలమైన, అవినీతి స్నేహితుల దృష్టి మరల్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని కవిత అన్నారు.
