అమరావతి : రూ.500 కోసం గొడవపడి మనస్థాపానికి గురై దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ విషాదకర ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడలోని వాసవీ నగర్‌లో కొలుసు రాంబాబు(45), కనకదుర్గ(40) దంపతులు నివాసం ఉంటారు.
Also Read.. ఏ గాలి హైదరాబాద్‌లో బీఆర్ఎస్ గెలువును అడ్డుకోలేకపోయింది
శనివారం మధ్యాహ్నం రూ.500 కోసం ఇద్దరిమధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య కనకదుర్గ ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న భర్త రాంబాబు కూడా మరో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
