రేపటి నుండి CBSE బోర్డ్ ఎగ్జామ్ (10వ తరగతి, 12వ తరగతి) ప్రారంభం కానున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) రేపటి నుండి అంటే 15 ఫిబ్రవరి 2024 నుండి 10వ, 12వ తరగతి పరీక్షలను నిర్వహించనుంది. పరీక్షకు ముందు, విద్యార్థులు కొన్ని ముఖ్యమైన సూచనలు కచ్చితంగా తెలుసుకోవాలి.
కొన్ని ముఖ్యమైన సూచనలు:
– ఉదయం 10 గంటలకు ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 10 గంటలకు వచ్చే విద్యార్థులను మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తారు. పరీక్ష ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది.
-తమ అడ్మిట్ కార్డును అన్ని పరీక్ష రోజులలో తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి.
– తమ సొంత స్టేషనరీని తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి తీసుకురావాలి.
-ప్రశ్నపత్రం ఇచ్చిన తర్వాత, అభ్యర్థులు సమాధానమిచ్చే ముందు ప్రశ్నలను జాగ్రత్తగా చదవాలి.
– సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి మెట్రో సేవలను ఉపయోగించుకోవచ్చు.
-సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కూడా సర్క్యులర్ జారీ చేసింది. ఇందులో రేపటి నుంచి 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయని బోర్డు పేర్కొంది. ఈసారి దేశ, విదేశాల్లోని 26 దేశాల నుంచి 39 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి విద్యార్థులందరూ ఉదయం 10 గంటలకు లేదా అంతకంటే ముందే తమ పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సర్క్యులర్‌లో చెప్పింది.
– ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా, విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోవడానికి ముందుగానే ఇళ్ల నుండి బయలుదేరాలని బోర్డు సూచించింది.
ఇది కూడా చదవండి: మహిళల కోసం పెబుల్ నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్ లు రిలీజ్..ధర, ఆఫర్ వివరాలివే..!!
The post రేపటి నుంచి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు షురూ..విద్యార్థులకు సూచనలు..!! appeared first on tnewstelugu.com.
