హైదరాబాద్: రేపు జవహర్ నగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈమేరకు జవహర్ నగర్ డంప్ వద్ద నిర్మిస్తున్న లీచెట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు. అలాగే జవహర్ నగర్‌లో జిఓ 58 లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లార్‌రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ వాణీదేవి, శంబీపూర్ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ ప్రారంభించిన లీషెట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌తో భవిష్యత్తులో జవహర్‌నగర్, పరిసర ప్రాంతాల్లో ఎలాంటి నీటి కాలుష్యం సమస్య తలెత్తినా పరిష్కరిస్తామని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది.
The post రేపు జవహర్ నగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన appeared first on T News Telugu.
