పంటకు కనీస మద్దతు ధరకి చట్టబద్ధతతోపాటు పలు డిమాండ్ సాధన కోసం దేశ రాజధాని హస్తినాను ముట్టడించిన రైతులు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు. ఈనెల 16న గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. తమ సమస్యలను ప్రజలకు వివరించి ..కేంద్రం తీరును ఎండగట్టేందుకే భారత్ బంద్ కు పిలుపునిచ్చినట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఈ బంద్ కు పలు కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. 16న ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు బంద్ కొనసాగుతుందని రైతు సంఘా నేతలు ప్రకటించారు. ఆ రోజు మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జాతీయ రహదారులను ముట్టడిస్తామని తెలిపారు.
రైతుల ఆందోళనల మధ్య నేటి నుంచి సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు మెట్రోలో ప్రయాణించాలని సూచించారు. విద్యార్థులు ఉదయం 10 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సర్క్యులర్ జారీ చేసింది.ముగ్గురు కేంద్ర మంత్రుల బృందం ఇవాళ రైతులతో సమావేశం కానుంది. రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్‌లకు కేంద్రం అధికారం ఇచ్చింది. సభ జరిగే వరకు మళ్లీ ఢిల్లీ వైపు వెళ్లే ప్రయత్నం చేయబోమని కాపు నేతలు తెలిపారు. కేంద్రం ప్రతిపాదనల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇది కూడా చదవండి: పద్ధతి మార్చుకోని సీఎం, భాష, తీరుపై సర్వత్రా విమర్శలు..
