జూన్ 26 నుంచి వానాకాలం పంట పెట్టుబడి కోసం రైతుబంధు నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇవాళ జరిగిన సమీక్ష సమావేశంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని రైతులు యథావిధిగా నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు.
ఈ మేరకు వెంటనే నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు, అదనపు ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అదే సమయంలో బంజరు భూములకు పట్టాలు కేటాయించి, భూములు పొందిన రైతులకు రైతుబంధు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
రైతుబంధు ఫండ్‌పై సీఎం కేసీఆర్ నుంచి శుభవార్త..! appeared first on T News Telugu
