హైదరాబాద్: తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో మూడు రోజుల్లో అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి ప్రాంతాల్లో నేటి నుంచి శుక్రవారం వరకు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
పసుపు హెచ్చరిక
భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో శుక్రవారం, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యార్మ్రల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శనివారం నుంచి ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నారింజ హెచ్చరిక
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రైతులకు శుభవార్త. The post నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి appeared first on T News Telugu.
