పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలంటూ..ఢిల్లీ చలోనిరసన కార్యక్రమంలో భాగంగా దేశ రాజధాని శివారులో ఉన్న రైతులపై మరోసారి బాష్పవాయువు ప్రయోగం జరిగింది. రెండోరోజు శంభు సరిహద్దులో బుధవారంఈ ఘటన జరిగినట్లు రైతులు తెలిపారు.హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారని తెలిపారు.
రైతుల నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హర్యానా నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంలో పెద్ద ఎత్తున సిమెంట్ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. కొన్ని మార్గాల్లో వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రైతులను అడ్డుకునేందుకు కాంక్రీటు దిమ్మెలు, ఇనుప కంచెలు, మేకులు, కంటైనర్ల గోడలతో బహుళ అంచెల్లో బ్యారికేడ్లను పెట్టారు. రహదారుల దిగ్బంధంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక చోట్ల కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచాయి.
మరోవైపు నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించేందుకు వాడే డ్రోన్లు పంజాబ్ భూభాగంలోకి రావడంపై ఆ రాష్ట్ర అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పటియాలా డిప్యూటీ కమిషనర్ షౌకత్ అహ్మద్.. అంబాలా డీసీకి లేఖ రాశారు. శంభు సరిహద్దుల్లో డ్రోన్లు తమ భూభాగంలోకి రావొద్దని తేల్చి చెప్పారు. ప్రస్తుతానికైతే డ్రోన్ల కదలికలు ఆగిపోయాయని అహ్మద్ చెప్పారు.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి మాట్లాడిన తీరుసరిగా లేదు
The post రైతులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం appeared first on tnewstelugu.com.
