నాగర్ కర్నూలు : రైతు దగ్గర లంచం తీసుకుంటూ ఓ డిప్యూటి సర్వేయర్ ఏసీబీకి చిక్కారు. రైతుకు సంబంధించిన భూమికి సంబంధించిన ప్రొసిడింగ్స్ కాపీని జారీ ఇచ్చేందుకు లంచం తీసుకున్న డిప్యూటి సర్వేయర్ ను అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
Also Read.. మ్యాచ్ చూస్తూ.. రెండు గ్లాస్‌ల బీరు లాగించేసిన లేడీ.. వీడియో
వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన మహ్మద్ సిరాజ్ అనే రైతు.. తన భూమికి చెందిన ప్రొసిడింగ్స్ కాపీ కోసం కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. ఇందుకోసం డిప్యూటీ సర్వేయర్ రమావత్ వాస్య లంచం డిమాండ్ చేయడంతో.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
Also Read.. మామిడి పల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ముగ్గురు మృతి
ఈ క్రమంలో శనివారం ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ సర్వేయర్ రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుని, నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచామని ఏసీబీ అధికారులు తెలిపారు.
