మెదక్ జిల్లా చేగుంట 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఇద్దరు వ్యక్తుల రోడ్డు దాటుతుండగా ఓ కారు అతివేగంగా వచ్చిన వారిని ఢీకొట్టింది.
Also Read.. మొయినాబాద్ యువతి మృతి కేసులో కొత్త మలుపు!
ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతులు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
