
రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దుర్గానగర్ సిటీ, రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలుడు సంభవించింది. ఇంటి యజమాని అస్మతి కుమారి వంట చేస్తుండగా సిలిండర్‌కు మంటలు అంటుకున్నాయి. అస్మతి కుమారి భయంతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీసింది. కొద్దిసేపటికే మంటలు పెరిగి సిలిండర్ పేలింది. ఆ పేలుడు ధాటికి ఇంటి గోడలు కూలిపోయాయి. అయితే బాంబుల శబ్ధంతో గ్యాస్ సిలిండర్లు పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
