వాలెంటైన్స్ డే వీక్ నేటి షురూ అయ్యింది. అమెజాన్ లో బిగ్గెస్ట్ సేల్ లైవ్ అవుతోంది. ఇకామర్స్ ఫ్లాట్ ఫామ్ లో వాలెంటైన్స్ స్మార్ట్ ఫోన్ స్టోర్ సేల్ షూరు అయ్యింది. దాని కోసం ప్రత్యేక పేజీని క్రియేట్ చేసింది. సేల్ లో కస్టమర్లు చాలా చౌక ధరలో బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ల్ లను కొనుగోలు చేయవచ్చు. ఉత్తమ ఆఫర్ గురించి మాట్లాడితే ..వినియోగదారులు చౌక ధరలో వన్ ప్లస్ 11ఆర్ 5జీని మీ సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం వన్ ప్లస్ పవర్ ఫుల్ ఫోన్ ను రూ. 39,999కి బదులుగా రూ. 38,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ధర బ్యాంక్ ఆఫర్ తో సహా, అంటే బ్యాంక్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకున్న తర్వాత ఫోన్ ను చౌకగా ఇంటికి తీసుకురావచ్చు. ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీని కింద రూ. 27.050 డిస్కౌంట్ లభిస్తుంది.ఈ ఫోన్ 100W SuperVOOC ఛార్జింగ్‌తో స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 మొబైల్ ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంది. స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుంటే… ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దాని ముందు భాగంలో పంచ్ హోల్ నాచ్ తోపాటు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్‌ను కూడా ఉంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13తో రన్ అవుతుంది. కెమెరా పరంగా చూస్తే, ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం, ఫోన్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.వన్ ప్లస్ 11ఆర్ 4nm ప్రాసెస్ ఆధారిత ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌తో Adreno 730 GPU, 16జీబీ వరకు LPDDR5X ర్యామ్ ను కలిగి ఉంది.పవర్ కోసం, వన్ ప్లస్ 11ఆర్ 5000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్‌లతో వస్తుంది. వినియోగదారులు దీన్ని బ్లాక్, సిల్వర్ కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ కిడ్..!!
The post వన్ ప్లస్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్..అమెజాన్‌లో బంపర్ సేల్..!! appeared first on tnewstelugu.com.
