
వరంగల్ రైల్వేస్టేషన్లో ప్రమాదం. ఈ(శుక్రవారం) ఉదయం రైల్వే స్టేషన్లోని వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రయాణికులు అక్కడ ఉండగా ప్లాట్ఫాం ఒకటి సమీపంలోని రేకుల షెడ్డుపై ఉన్న వాటర్ ట్యాంక్ కూలిపోయింది. దీంతో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రైల్వే పోలీసులు వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ట్యాంక్ ఎందుకు పడిపోయింది అని రైల్వే సిబ్బంది ఆరా తీస్తున్నారు.
