
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరదలకు పలుచోట్ల రోడ్లు తెగిపోయి జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వేములవాడ మూలవాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. జగిత్యాల జిల్లాకు చెందిన మారుతి అనే వ్యక్తి వాగు వైపు వెళ్లి చెట్ల మధ్యలో చిక్కుకుపోయాడు. గమనించిన ఓ వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. వెంటనే వేములవాడ సీఐ కర్నాకర్ బ్లూ కోల్ట్ సిబ్బందితో ఘటనాస్థలానికి వచ్చి, బాధితుడిని తాడు సహాయంతో బయటకు తీసుకువచ్చారు. చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వర్షాలు ఎక్కువగా పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు.
