ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది రైల్వే శాఖ. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) వార్షిక క్యాలెండర్-2024ను విడుదల చేసింది. అన్ని ప్రాంతీయ అధికారిక వెబ్‌సైట్‌లలో ఈ క్యాలెండర్‌ను అందుబాటులో ఉంచింది. రాబోయే నోటిఫికేషన్‌లు, పరీక్ష షెడ్యూల్ ఈ క్యాలెండర్‌లో ఉన్నాయి. నాన్-గ్రాడ్యుయేట్ పాప్యులర్ కేటగిరీలైన గ్రాడ్యుయేట్ (4, 5, 6 లెవల్స్), అండర్ గ్రాడ్యుయేట్ (లెవెల్‌లు 2, 3) పోస్టులు, జూనియర్ ఇంజనీర్లు, పారామెడికల్ రెండింటికీ సాంకేతికేతర ప్రసిద్ధ కేటగిరీలతో సహా వివిధ వర్గాల కోసం పరీక్షల షెడ్యూల్ ఉంటుంది. కేటగిరీలు, గ్రూప్-డీ స్థాయి, మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీలకు సంబంధించిన జాబ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించింది. వీటితో పాటు 5,696 అసిస్టెంట్ లోకో పైలట్, 9,000 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేసేందుకు క్యాలెండర్ ద్వారా తెలిపింది. ఫిబ్రవరి 2న విడుదలైన రైల్వే వార్షిక క్యాలెండర్‌ను ఆర్‌ఆర్‌బీ అధికారికంగా అందుబాటులో ఉంచింది.
వార్షిక క్యాలెండర్ ప్రకారం టెక్నీషియన్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్- జూన్ మధ్య పరీక్ష షెడ్యూల్ నిర్ణయించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 19లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎన్‌టీపీసీ (గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్), జూనియర్ ఇంజనీర్స్ (JE), పారామెడికల్ కేటగిరీలు, గ్రూప్-డీతో పాటు పలు కేటగిరీల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జులై- సెప్టెంబర్ నెలల మధ్య జారీ కానుంది. మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల నోటిఫికేషన్ అక్టోబర్-డిసెంబర్ 2024 మధ్య విడుదలకానుంది.
ఇది కూడా చదవండి:పాక్ లో బాంబు పేలుళ్లు.. 26 మంది మృతి
