వాహనాలకు ఉపయోగించే ఫాస్టాగ్ కేవైసీ గడువును పెంచుతున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది. జవనరి 31 చివరి తేదీగా ఉన్న గడువును ఫిబ్రవరి 29 వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఫాస్టాగ్‌ల ద్వారా టోల్ వసూళ్లను మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. కేవైసీ పూర్తిచేయని ఫాస్టాగ్‌లను నిలిపేసేందుకు సిద్ధమైంది. కేవైసీ చేయని ఖాతాలను ఫిబ్రవరి 29, 2024 తర్వాత బ్యాంకులు డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేస్తాయని జాతీయ రహదారుల సంస్థ ప్రకటించింది. వాహనదారులు ఒకే ఫాస్టాగ్‌ను అనేక వాహనాలకు ఉపయోగించడం, ఒకే వాహనానికి పలు ఫాస్టాగ్‌లను లింక్ చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇటువంటి వాటిని అరికట్టేందుకు ‘ఒకే వాహనం-ఒకే ఫాస్టాగ్’ విధానానికి ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు తీసుకుంటోంది.
Read Also: తల్లిదండ్రులు చూస్తుండగానే బావిలో పడి చిన్నారి మృతి
వినియోగదారులు ముందుగా ఫాస్టాగ్ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లాలి. అందులో మొబైల్ నెంబర్, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వాలి. ఓటీపీ అథెంటిఫికేషన్ పూర్తయిన తర్వాత డ్యాష్ బోర్డులో మై ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్లాలి. అక్కడ కేవైసీ స్టేటస్ ను చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఫాస్టాగ్ కేవైసీ పెండింగ్ లో ఉంటే సబ్ సెక్షన్ ద్వారా అప్ డేట్ చేసుకోవాలి. దీనికోసం అవసరమైన ఐడీ కార్డుతో పాటు వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్ తోపాటు పాస్ పోర్టు సైజ్ ఫొటో కావాలి. అన్ని అప్ లోడ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని సబ్ మీట్ బటన్ పై క్లిక్ చేయాలి. తర్వాత కంటిన్యూపై క్లిక్ చేస్తే కేవైసీ వెరిఫికేసన్ కంప్లీట్ అవుతుంది.
