ఎల్బీ స్టేడియంలో జరిగిన సీఎం కప్ ముగింపు కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, శాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పాల్గొని వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు పతకాలు, సర్టిఫికెట్లు, షీల్డ్‌లు, నగదు బహుమతులను అందజేశారు. సీఎం కప్ పురుషుల విభాగంలో హైదరాబాద్ 89 పాయింట్లతో ప్రథమ, రంగారెడ్డి 56 పాయింట్లతో ద్వితీయ, మేడ్చల్ మల్కాజిగిరి 41 పాయింట్లతో తృతీయ స్థానంలో నిలిచాయి.
ఈ సందర్భంగా సీఎం కప్ విజయవంతానికి సహకరించిన వారందరికీ మంత్రి శ్రీనివాస్ గూడెం కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు క్రీడాశాఖను మరింత అభివృద్ధి చేస్తున్నాం. సీఎం కప్ ఏడాదికి ఒకసారి జరుగుతుంది. గ్రామస్థాయిలో వేలాది మంది క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. దీంతో వారు మరింత ఉత్సాహంగా ఉన్నారు. వచ్చే సీఎం కప్‌లో మరిన్ని క్రీడలను చేర్చుతాం. పైరవీలతో క్రికెట్ ఆడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తప్పులు గుర్తించి సరిదిద్దుకుంటాం. సీఎం కేసీఆర్ అనుమతితో త్వరలో మిగిలిన క్రీడలతో మళ్లీ సీఎం కప్ నిర్వహిస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
The post విజయవంతంగా ముగిసిన సీఎం కప్..! appeared first on T News Telugu
