తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక మొదటిసారి తన విడాకుల గురించి మనసు విప్పి మాట్లాడింది. విడాకుల తర్వాత ఎంతో బాధపడ్డానని..చాలా ఏడ్చానని చెప్పుకొచ్చింది. తనది లవ్ మ్యారేజ్ కాదని.. పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడం.. కొన్ని విషయాల్లో వర్కౌట్ కాక విడపోవాల్సి వచ్చిందని తెలిపింది. మనుషులను నమ్మకూడదని అర్థమైందని.. పెళ్లితో ఓ పాఠం నేర్చుకున్నానని… కానీ విడాకుల తర్వాత చాలా బాధగా ఉందని.. అందరూ తననే కామెంట్స్ చేశారని.. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, నెగిటివిటీ చూసి చాలా బాధపడ్డానని.. అలాంటి సమయంలో తన ఫ్యామిలీ తనకు సపోర్ట్ గా నిలబడిందని ఎమోషనల్ అయ్యింది నిహారిక. అయితే తాజాగా నిహారిక ఇంటర్వ్యూ వీడియోపై ఆమె మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ స్పందించాడు. కేవలం ఒక సైడ్ మాత్రమే విని జడ్జ్ చేయకూడదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
‘రెండు వైపుల ఆ బాధ, కష్టం ఓకే విధంగా ఉంటుంది. విడాకుల గురించి మాట్లాడుకూడదు.. అందులోనూ ఒక వైపు మాత్రమే అసలు మాట్లాడకూడదు. దానివల్ల బాధపడిన వాళ్ల గురించి జోక్యం చేసుకోకూడదు. అంతకంటే ఆ బాధ గురించి.. దాని నుంచి ఎలా బయటపడింది అనేది మాట్లాడితే ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే నమ్మకం లాంటి వాటి గురించి మాట్లాడాలంటే ఆ సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించి.. కానీ ఏమి తెలియకుండా ప్రజలు ఒకవైపు జడ్జి చేసి కామెంట్స్ చేయడం పూర్తిగా ఎంత తప్పో.. ఇలాంటి ప్లాట్ ఫామ్స్ ఉపయోగించి ప్రజలకు ఒకవైపు జరిగింది మాత్రమే చెప్పడం కూడా అంతే తప్పు. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం చైతన్య చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
