రష్యాతో ఏడాదికాలంగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని విద్యార్థులకు తుపాకీతో కాల్చడం గురించి ట్రైనింగ్ ఇవ్వున్నట్లు తెలిపింది. యుద్ధం ప్రభావంతో ఉక్రెయిన్ లో పాఠశాల విద్య తీవ్రంగా ప్రభావితం అయ్యింది. ఈక్రమంలో యుద్ధానికి సంబంధించిన విషయాలను పాఠ్యాంశాలుగా చేర్చారు. తాజాగా విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వాలని రక్షణ మంత్రిత్వశాఖ రూపొందించిన ఇంటరాక్టివ్ టెక్నాలజీ సాయంతో రైపిల్, పిస్టోల్ కాల్చడంలో ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు ఓ అధికారి తెలిపారు.
వెస్ట్ ఇవానో ఫ్రాంక్విస్క్ సహా ఇతర ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులకు 23నెలలపాటు ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. తర్వాత తూర్పు ప్రాంతంలో దీన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. సైనిక, దేశభక్తి విద్యకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంపొందించడంలో భాగంగా మొబైల్, మల్టీమీడియా టెక్నాలజీతో ఈ ట్రైనింగ్ ఉంటుందని ఇవానో గవర్నర్ తెలిపారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ లో 3500 విద్యాసంస్థల్లో సౌకర్యాలు దెబ్బతినగా 365 చోట్ల పూర్తిగా నాశనం అయ్యిందని కీవ్ వెల్లడించింది. ఈ క్రమంలో విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తోంది.
కాగా కొన్నాళ్ల క్రితం రష్యాకు చెందిన రెండు కమాండ్ ఫ్లైట్స్ ను ఉక్రెయిన్ కూల్చింది. ఆర్థికంగా ఇది మాస్కోకు పెద్ద దెబ్బ అని కీవ్ వెల్లడించింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ పై రష్యా దాడులు మరింత తీవ్రతరం చేస్తుందని..ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ఛాన్స్ ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: దళితబంధు నిధులు విడుదల చేయాలంటూ ఆత్మహత్యాయత్నం..!!
