బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇవాళ( సోమవారం )అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గారు. అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్ టెస్ట్‌లో నితిష్ కుమార్‌కు 129 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. దీంతో ఆయన బలపరీక్షలో అత్యంత ఈజీగా విజేతగా నిలిచారు. మరోవైపు అసెంబ్లీ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ సమయంలో ఆర్జేడీ ఎమ్మెల్యేలు ప్రహ్లాద్ యాదవ్, నీలం దేవి, చేతన్ ఆనంద్ కూడా ఎన్డీయే వైపు మొగ్గారు.
నితీశ్ కుమార్ కొన్ని రోజుల క్రితం మహాఘట్‌బంధన్ నుంచి బయటకు వచ్చారు. నితీశ్ ఎన్డీయేతో కూడి… తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణం చేయడంతో బలనిరూపణ చేసుకోవాల్సి వచ్చింది. బలపరీక్షకు ముందు రోజు వరకు బీహార్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో క్యాంపు ఏర్పాటు చేసారు. దాదాపు వారం రోజులుగా బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉన్నారు. బలపరీక్ష నేపథ్యంలో నిన్న(ఆదివారం) సాయంత్రమేఎమ్మెల్యేలు పాట్నా వెళ్లారు.
ఇది కూడా చదవండి:చంచల్ గూడ జైల్లో ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి
