హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఈ మేరకు ఏఐజీ ఆస్పత్రి డాక్టర్లు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని అందులో పేర్కొన్నారు.
Also Read.. దారుణం. అబ్దుల్లాపూర్‌మెట్‌లో భార్య తల నరికిన భర్త
తమ్మినేని వీరభద్రం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని, ప్రస్తుతానికి మందులతోనే చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని, ఆ నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
Also Read.. ఇదేనా కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు
ఇదిలా ఉండగా.. తమ్మినేని అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆయన్ను పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. ఆ తర్వాత తమ్మినేని కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
The post విషమంగానే తమ్మినేని ఆరోగ్యం.. పరామర్శించిన హరీశ్‌రావు appeared first on tnewstelugu.com.
