సరదాగా వెళ్లిన విహారయాత్ర విషాదాంతం అయ్యింది. అరకు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఓ కారు ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. విశాఖకు చెందిన ఓ కుటుంబం అల్లూరిజిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకుకు వెళ్లింది. ఇన్నోవా కారులో ఇద్దరు చిన్నారులతోపాటు మొత్తం 11 మంది ప్రయాణిస్తుండగా ఊహించని ఘటన జరిగింది. అరకు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. లోయలో పడటంతో ఓ మహిళ మరణించింది. మిగతా వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి.
ఇది కూడా చదవండి: వేములవాడకు వెళ్లి వస్తుండగా ఘోరరోడ్డు ప్రమాదం..ఒక్కరు మృతి.!
ఈ ఘటనను గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారును లోయలో నుంచి బయటకు తీశారు.తీవ్రంగా గాయపడిన వారికి దగరలోని అరకు ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
