ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా 4 మృతి చెందింది. ఆలమూరు మందారం జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న కారు టాటా మ్యాజిక్ వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌లోని ముగ్గురు వ్యక్తులు, కారులో ఉన్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కాగా, శనిదోష నివారణకు వ్యాన్‌లో ఉన్నవారంతా రంపచోడవరం నుంచి కొత్తపేట మండలం మందపల్లిలోని ఆలయానికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కారులోని వ్యక్తులు విశాఖపట్నం నుంచి భీమవరం వెళ్తున్నారని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
