తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కంపార్టుమెంట్ల నుంచి కాకుండా నేరుగా దర్శనానికి పంపిస్తున్నారు టీటీడీ అధికారులు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని తెలిపారు.
Also Read.. ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసింది
కాగా, శుక్రవారం స్వామివారిన 56,588 మంది భక్తులు దర్శించుకోగా.. 16,754 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.26 కోట్లు వచ్చిందన్నారు.
