శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లపై ద్రుష్టి సారించారు ఈవో పెద్దిరాజు. సమస్యలను అధిగమించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. బుధవారం క్షేత్రపరిధిలోని పలు ప్రాంతాల అధికారులతో కలిసి పర్యటించిన ఆయన అనంతరం సమీక్ష నిర్వహించారు.
ముఖ్యంగా ట్రాఫిక్, పార్కింగ్, మంచినీటి సరఫరా, క్యూలైన్ల నిర్వహణ, విద్యుద్దీకరణ, తాత్కాలిక శౌచాలయాలు, పాతాళగంగలో స్నానఘట్టాల వంటి ఏర్పాట్ల పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణకు వచ్చే జిల్లా యంత్రాంగానికి అవసరమైన వసతి ఏర్పాట్ల గురించి పరిశీలించారు. విధుల్లో ఉండే సిబ్బందికి అల్పాహార వసతులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా సమాచార సూచిక బోర్డులను విరివిగా ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు.
కాగా మార్చి 1 నుండి 11 వరకు జరిగే బ్రహ్మోత్సవాల నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆయన కోరారు. సమావేశంలో యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, వైదిక సిబ్బంది, పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రసిద్ధరావు, ఎస్ఐ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఉదయాన్నే నానబెట్టిన వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే…!!
