ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల భ్రమరాంబికాదేవి అమ్మవారి ప్రసాదంలో ఎముక వచ్చినట్లు ఓ భక్తుడు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ప్రసాదంలో ఎముక ప్రత్యక్షమైందంటూ జరిగిన ప్రచారం అవాస్తమని అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు మారండేయశాస్త్రి , వేదపండితులు గంట రాధాక్రుష్ణశర్మ తెలిపారు. పాకశాలలో తయారు చేసే రాజూవారి ప్రసాదాలు నియమనిష్టలతో శుచీశుభ్రతలో ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో జరుగుతాయి అయిన్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గల పాకశాలలో పులిహోర ప్రసాదంలో ఎముక వచ్చిందనేది వాస్తవం కాదన్నారు. ఈఘటన తమకు ఎంతో మనోవేదనకు గురి చేసిందన్నారు. దీనిపై ఎన్నో అనుమానాలు కూడా ఉన్నాయి అన్నారు.
శ్రీశైల క్షేత్ర ప్రతిష్ట దెబ్బతీసే విధంగా భక్తుల మనోభావాలను కించపరిచేవిధంగా ఇలాంటి వార్తలు వస్తున్నాయని అన్నారు. ఇలాంటి ఘటనపై భక్తులు సమన్వయంతో వ్యవహారించాలన్నారు. ఆలయంలో తీసుకున్న పులిహోర ప్యాకెట్ లో కనిపించిన గుర్తుతెలియని వస్తువులను ఎముకలుగా భావించి భక్తుడు ఫిర్యాదు చేశారన్నారు.
ఇది కూడా చదవండి : మనీలాండరింగ్ కేసులో ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు
