చెన్నై నగర మాజీ మేయర్ సదాయి దురైస్వామి కుమారుడు, ఫిల్మ్ డైరెక్టర్ వెట్రి దురైస్వామి శవం సట్లెజ్ నదిలో లభ్యమైంది. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో వెట్రి ప్రయాణిస్తున్న కారు ఫిబ్రవరి 4వ తేదీన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇంద్రావతు ఒరునాల్ అనే తమిళ చిత్రానికి వెట్రి దర్శకత్వం వహించాడు. అయితే 9 రోజుల క్రితం వెట్రి కారుకు ప్రమాదానికి గురైంది.
అప్పటి నుంచి ఆయన ఆచూకీ లభించలేదు. వెట్రితో పాటు ప్రయాణిస్తున్న గోపీనాథ్ అనే మరో వ్యక్తిని రక్షించారు. అతను ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కారు డ్రైవర్ టెంజిన్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. 45ఏళ్ల వెట్రికోసం మాత్రం గాలించారు. కానీ ఆయన ఆచూకీ లభించలేదు. కొడుకు కోసం సదాయి దొరైస్వామి రివార్డు కూడా ప్రటించారు. వెట్రి ఆనవాళ్లు గుర్తించినవాళ్లకు కోటిరూపాయల నజరాన ప్రకటించారు. కాగా వెట్రి శవాన్ని సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీకి పోస్టుమార్టం కోసం తీసుకెళ్లారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ దెబ్బకు..కాంగ్రెస్ కకావికలం..!!
The post సట్లెజ్ నదిలో తమిళ డైరెక్టర్ మృతదేహం..!! appeared first on tnewstelugu.com.
