సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు ఉందంటూ ఫోన్ కాల్ రావడంతో కలకలం రేగింది. ఈ విషయం తెలియడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రైల్వే స్టేషన్ లో ఓ ప్రముఖ రెస్టారెంట్లో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని దుండగులు శనివారం సాయంత్రం ఫోన్ చేశారు. దీంతో ఆ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఒక్కసారిగా భయందోళన మొదలైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్ అండ్ డిటెక్షన్ స్వ్కాడ్ తో ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్టేషన్ లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేవారు. బెదిరింపు కాల్స్ వచ్చిన రెస్టారెంట్ ను తాత్కాలికంగా మూసివేశారు. ప్రయాణికులను అందులోకి అనుమతి ఇవ్వలేదు. అయితే పోలీసులకు మాత్రం తనిఖీల్లో అనుమానస్పదంగా ఏమీ కనిపించలేదు.
ఇది కూడా చదవండి: మంచంపై కూర్చోని ఈ పనులు చేస్తున్నారా?చిక్కులు తప్పవు..!!
ఈ తనిఖీలు అర్థరాత్రి వరకు కొనసాగాయి. కొంత సమయం తర్వాత అది ఫేక్ వార్త అని తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫోన్ కాల్ ఎవరు చేశారు..ఎందుకు చేశారు ఎక్కడి నుంచి చేశారన్నదానిపై ఫోకస్ పెట్టారు.
