రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సమీపంలో వ్యవసాయ కళాశాల నూతన కాంప్లెక్స్‌ను మంత్రి కేటీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం కాంప్లెక్స్‌ను పరిశీలించారు. మంత్రులతో పాటు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జాతీయ ప్రణాళికా సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అతిథులుగా హాజరయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక, సేవా కేంద్రంగా విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. మంత్రి కేటీఆర్ చొరవతో రాష్ట్రం విద్యారంగంలో ఆదర్శంగా నిలుస్తోంది. కేజీ నుంచి పీజీ వరకు రాష్ట్రంలోనే తొలి క్యాంపస్, గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూల్, వ్యవసాయ పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాల, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, ఐటీఐ, నర్సింగ్ కళాశాల, జేఎన్టీయూ కళాశాలలన్నీ సిరిసిల్లకు వస్తాయి.
