బ్యాటింగ్‌లో తిరుగులేదు.. బౌలింగ్‌లో ఎదురులేదు.. ప్రత్యర్థి నుంచి అసలు పోటీనే లేదు.. ఆఖరి టీ20లోనూ భారతే ఫేవరెట్. బుధవారం అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లోనూ విజయం సాధించి సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేస్తుందనేది అందరి అంచనా. కుర్రాళ్ల జోరుతో ఇప్పటికే 2-0తో సిరీస్ గెలుచుకున్న టీమ్‌ఇండియా అఫ్గానిస్థాన్‌తో ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. బెంగళూరులో జరిగే ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో తేలిపోయిన అఫ్గాన్ ఏ మేరకు నిలుస్తుందో చూడాలి. టీ20 ప్రపంచకప్ ముందు దూకుడే మంత్రంగా టీమ్‌ఇండియా సాగుతోంది.
శివమ్ దూబే, జితేశ్ శర్మ, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ గత రెండు మ్యాచ్‌ల్లో రాణించగా.. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. ఎటొచ్చి కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరే టీమ్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతున్నది. ఎప్పుడూ లేని విధంగా హిట్‌మ్యాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ కావడం అతడిపై ఒత్తిడి పెంచుతుందనడంలో సందేహం లేదు.
Read Also: కనుమ కానుకగా కోడి, ఫుల్ బాటిల్ మందు పంచిన ఎమ్మెల్యే
తొలి మ్యాచ్‌లో 17.3 ఓవర్లకు 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. రెండో మ్యాచ్‌లో 15.4 ఓవర్లకే 173 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. ఆరంభంలో వికెట్లు పడినా ధాటిగా ఆడాలన్న లక్ష్యంతో ఈ రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్లు కనిపించారు. శివమ్ దూబె వరుస మ్యాచ్‌ల్లో మెరుపు అర్ధశతకాలు బాది ఆకట్టుకోగా.. రెండో టీ20లో ఓపెనర్ యశస్వి జైస్వాల్, కోహ్లి సత్తాచాటారు. 14 నెలల విరామం తర్వాత టీ20 మ్యాచ్ ఆడిన కోహ్లి 181 స్ట్రైక్‌రేట్‌తో 16 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. స్పిన్‌లో కాస్త నెమ్మదిగా ఆడే అతడు ముజీబ్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న 7 బంతుల్లో 18 పరుగులు చేయడం విశేషం. కెప్టెన్ రోహితే పరుగులు అందుకోవాల్సి ఉంది. రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన అతడు.. మూడో టీ20లో సత్తాచాటాలని జట్టు కోరుకుంటోంది. పరిస్థితులు ఎలా ఉన్నా బాదడమే లక్ష్యంగా ఈ సిరీస్ ఆడుతున్న టీమ్‌ఇండియా అదే వ్యూహంతో మరోసారి బరిలో దిగనుంది.
The post సిరీస్‌పై కన్నేసిన కుర్రాళ్లు.. ఆఫ్గాన్‌తో నేడు మూడో టీ20.. appeared first on tnewstelugu.com.
