
రాష్ట్ర శాసనమండలి చైర్ పర్సన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని అన్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర నాయక్, ఎమ్మెల్సీ రమావత్ రవీంద్రనాయక్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. రైతు బంధు, రైతు భీమా కార్యక్రమాలను అమలు చేసి దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. కేంద్రం సహకరించకపోగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటోందని సుఖేందర్ రెడ్డి అన్నారు.
