నకిలీ కంపెనీ లతో సీఎం రేవంత్ రెడ్డి ప్రచార ఆర్భాటం చేసుకుంటున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్. దావోస్ కు వెళ్లి అదే పని చేశారన్నారు.ఇవాళ(బుధవారం) హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు క్రిశాంక్…చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో మెయిన్ హార్ట్ అనే సంస్థకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు ఈ సీఎం రేవంత్ అదే సంస్థకు మూసీ అభివృద్ధి పనులు అప్పగిస్తున్నారు. రోజుకో నకిలీ సంస్థను రాష్ట్రానికి తెస్తున్నట్లు తప్పుడు ప్రకటనలూ చేస్తున్నారు. మోసగాళ్లకు సీఎం రేవంత్ ప్రాధాన్యత ఇస్తున్నారు. నకిలీ కంపెనీలకు రాష్ట్ర ప్రాజెక్టులను అప్పగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అదే చేశారు. ప్రస్తుతం చంద్రబాబు దారిలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టిక్కెట్ల కోసం వారసత్వ పోరు జరుగుతోందని విమర్శించారు మన్ను క్రిశాంక్. ఎంపీ టిక్కెట్ రేసులో వెనకపడ్డానని మైనంపల్లి అనుకుంటున్నారు. మైనంపల్లి సిద్ధిపేటలో మానేతలు కేటీఆర్, హరీష్ రావుల పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. భట్టి సతీమణి,పొంగులేటి తమ్ముడు,సీఎం తమ్ముడు ఎంపీ టిక్కెట్లు అడుగుతున్నారు. కాంగ్రెస్ ను ఎంపీ టికెట్ అడుగుతున్న మైనంపల్లి వార్తల్లో ఉండాలని అడ్డమైన ముచ్చట్లు చెబుతున్నారు. మైనంపల్లి హన్మంతరావు ఫ్రస్టేషన్ లో ఉన్నారు. కేసీఆర్,కేటీఆర్, హరీష్ రావును తిడితే వార్తల్లో ఉంటానని మైనంపల్లి భావిస్తున్నారు. మైనంపల్లి పొర్లుదండాలు వేసిన కేటీఆర్, హరీష్ రావు ఆయన్ను పట్టించుకోరు
ఎన్నికల అఫిడవిట్లలో తన విద్యార్హతలపై మైనం పల్లి ఒక్కో సారి ఒక్కో విధమైన సమాచారం ఇచ్చారన్నారు క్రిశాంక్. ఆయన ఏం చదువుకున్నారో తెలియదన్నారు. ఆయన కొడుకు డాక్టరు అని అంటారు ..ఏ డాక్టరో తెలియదు ..ఒక వేళ డాక్టర్ అయితే పిచ్చిగా ప్రవర్తిస్తున్న తన తండ్రికి చికిత్స చేయాలని సూచించారు మన్నె క్రిశాంక్.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ను గెలిపించి ప్రజలు మోసపోయారు
