అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న అనుచిత భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి.చెప్పలేని భాష లో రేవంత్ మాట్లాడుతున్నారు ..అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయన్నారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన తమను మీడియా పాయింట్‌కు వెళ్లకుండా అడ్డుకోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారు. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయి. రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదన్నారు.సీఎం భాషకు ధీటుగా బదులు ఇవ్వగలం.. కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద మాకు గౌరవం ఉందన్నారు.
ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడతామంటే ఆవకాశం ఇవ్వలేదున్నారు కడియం.ఇదే విషయాన్ని బయట మీడియాతో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారు. కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలనా .. అని ప్రశ్నించారు ఎమ్మెల్యే కడియం.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ చెప్పేదొకటి చేసేదొకటి
