గత ప్రభుత్వం ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ అన్నారు..1000 ఏండ్ల క్రితం ఏర్పాటు చేసిన సంస్కృతిక చిహ్నాలను మారుస్తామని.. గత వెయ్యి ఏండ్ల సంస్కృతిని అవమాన పరుస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివస్. చార్మినార్, కాకతీయతోరణం తెలంగాణ వారసత్వ చిహ్నాలు. మన రాజముద్రలో మూడు సింహాలు ఉంటాయి..అయితే వాటిని తొలగిస్తావా అని ప్రశ్నించారు. నిజాం రాజు కూర్చున్న చైర్ లో మీరు సీఎంగా కూర్చున్నారు మీ చైర్ ను వదిలివెస్తారా అని అన్నారు. కేసీఆర్ మిషన్ కాకతీయ చెరువులు పూడిక తీశారు. ఇప్పుడు మళ్లీ చెరువులు మళ్ళీ పుడ్చుతారా?. కాకతీయ తోరణం, చార్మినార్ ను తీసేస్తే వీరుల తెలంగాణ చరిత్రను అవమానించినట్లేనని అన్నారు. తెలంగాణ తల్లికి కిరీటం ఉంటే తప్పేంటి..దేవతలా ఉండడానికి కిరీటం పెట్టారు. తెలంగాణవాళ్ళు నగలు పెట్టుకోరని అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఫంక్షన్లకు వెళితే నగలు వేసుకుని వెళుతున్నారు కదా అని అన్నారు దేశపతి.
అందెశ్రీ పాటలో కాకతీయ తోరణం,చార్మినార్, గోల్కొండ కోట,రుద్రమదేవి లాంటి వాళ్ళ చరిత్ర ఉంది..అలా అని అందెశ్రీ పాటలో ఉన్న పదాలను తొలగిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు దేశపతి. సీఎంగా ఎవరు ఉంటే వాళ్ళ కీర్తి అందులో కనపడుతుంది. సెక్రటేరియట్ కేసీఆర్ కట్టారు అంటారా…లేక బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించింది అంటారా చెప్పాలన్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్.
ఇది కూడా చదవండి: బోరు వేస్తుండగా కుప్పకూలిన హోండా షోరూం బిల్డింగ్
