
హైదరాబాద్: నార్సింగి సీబీఐటీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వస్తున్న డంప్ లారీ ముందున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియరాలేదు.
