సూర్యాపేట జిల్లా ఇమాంపేటలోని ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ లో విషాదం జరిగింది. ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఫ్యాన్ కు ఉరి వేసుకోవడం గమనించి వెంటనే కాపాడే ప్రయత్నం చేశామని, ఆసుపత్రికి తరలించేలోపే విద్యార్థిని చనిపోయిందని వార్డెన్ చెబుతున్నారు. అయితే, తమ కూతురిది ఆత్మహత్య కాదని, ప్రిన్సిపాల్ వేధింపుల కారణంగానే చనిపోయిందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే యాదాద్రి జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే తాజాగా సూర్యాపేటలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది.
శనివారం ఇంటర్ విద్యార్థుల ఫేర్ వెల్ పార్టీ జరిగింది. సాయంత్రం జరిగిన ఈ పార్టీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని వైష్ణవి ఉత్సాహంగా పాల్గొందని వార్డెన్ చెప్పారు. వైష్ణవి మిగతా విద్యార్థునులతోనూ బాగానే ఉండేదని, ఎలాంటి గొడవలులేవని తెలిపారు. పార్టీలో స్నాక్స్, కూల్ డ్రింక్స్ పంచుతుండగా.. వైష్ణవి తన గదికి వెళ్లిపోయిం.. ఫ్యాన్ కు ఉరి వేసుకోవడం చూసి మిగతా విద్యార్థులు వచ్చి చెప్పారన్నారు. దీంతో వెంటనే వెళ్లి వైష్ణవిని కిందికి దించామని, వైష్ణవి అప్పటికి ప్రాణాలతోనే ఉందని అన్నారు రెసిడెన్షియల్ స్కూల్ వార్డెన్. 108 కు ఫోన్ చేసి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వైష్ణవిని పరిశీలించిన ఏరియా ఆసుపత్రి డాక్టర్లు.. మార్గమధ్యంలోనే చనిపోయిందని కన్ఫాం చేసినట్లు వార్డెన్ తెలిపారు. విద్యార్ధిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: దేశవ్యాప్తంగా త్వరలో జీపీఎస్ ఆధారిత టోల్ ఫీజు వసూళ్లు
