జనగామ జిల్లా చిల్పూరు మండలం గార్లగడ్డ తాండశివారు మల్లన్నగండి రిజర్వాయర్ వద్ద బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. బీటెక్ విద్యార్థి శేఖర్ రిజర్వాయర్లో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. మృతుడి స్వస్థలం దేవరావుప్పుల మండలం ధర్మగడ్డతండా అని పోలీసులు తెలిపారు.
మృతుడు ఆ సమయంలో వరంగల్ కిట్స్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి మృతి చెందడంతో శేఖర్ కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
The post స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి మృతి చెందిన బీటెక్ విద్యార్థి appeared first on T News Telugu.
