హైదరాబాద్: స్వాతంత్య్ర పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమం భారతదేశంలోనే తొలి ప్రజా ఉద్యమమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
తెలంగాణ ఉద్యమానికి ఎంతో మంది సహకరించారన్నారు. ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఎందరో ప్రజల ఉమ్మడి కృషితో తెలంగాణ ఏర్పడింది. మేమంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం. పదేళ్లు పూర్తవుతున్న నేటికి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. తదుపరి పరిణామాలు మన రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. తెలంగాణ ప్రజలందరికీ ఎమ్మెల్సీ కవిత 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
