
సిద్దిపేటలోని మంత్రి హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంలో హనుమాన్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు హనుమంతునికి అభిషేకం చేసి పూజలు నిర్వహించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పూజలకు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు హనుమాన్ మాల ధరించిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆ సమయంలో మంత్రి హరీశ్ రావు కార్యాలయం నుంచి హనుమాన్ భజన మోగనుంది.
