హమాస్ ఉగ్రవాదులతో జరుగుతున్నయుద్ధంలో తొలిసారి ఇజ్రాయెల్ సైన్యానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒకేసారి 24 మంది సైనికులను ఇజ్రాయెల్ సైన్యం కోల్పోయింది. ఇంత భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారని సైన్యం ప్రకటించింది.
Also Read.. బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు!
సెంట్రల్ గాజాలోని రెండు భవనాలను కూల్చేందుకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమైంది. ఈ క్రమంలో సోమవారం సైనికులు పేలుడు పదార్థాలను అమర్చుతున్నారు. అదే సమయంలో హమాస్ మిలిటెంట్‌లు గ్రనేడ్ దాడి చేశారు. దాంతో ఇజ్రాయెల్ సైనికులు అప్పటికే అమర్చిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలడంతో రెండు భవనాలు నేలమట్టం అయ్యాయి. దీంతో ఇరవై ఒక్క మంది ఇజ్రాయెల్ సైనికులు శిథిలాల కింద చిక్కుకొని మరణించారు.
Also Read.. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్: మళ్లీ వరల్డ్ నంబర్ 1గా సాత్విక్, చిరాగ్ జోడీ
మరోవైపు యుద్ధంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ కు అమెరికా సూచించింది. ఇదిలా ఉండగా.. ఈ యుద్ధంతో గాజాలోని 85 శాతం ప్రజలు తమ ఇండ్లను వదిలి వెళ్లిపోయారు. ప్రతి నలుగురు పాలస్తీనీయన్లలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారని యూఎన్ఓ వెల్లడించింది.
Also Read.. కాలేజ్ వాచ్‌మెన్‌తో పారిపోయిన ఇంటర్ విద్యార్థిని
అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగాలపై దాడులకు పాల్పడింది. అనంతరం దాదాపు 240 మంది ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా గాజాలోకి తరలించింది. అనంతరం ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం ప్రకటించింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాల ఒత్తిడితో కొందరు బందీలను హమాస్ వదిలిపెట్టింది. ఇంకా వారి చెరలో 100 మంది వరకు ఉన్నారు. మరోవైపు బందీలందరూ విడుదలయ్యే వరకు.. హమాస్‌ను అంతం చేసేవరకు యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ప్రకటించారు.
The post హమాస్‌తో యుద్ధం.. ఇజ్రాయెల్‌కు తొలిసారి భారీ ఎదురుదెబ్బ! appeared first on tnewstelugu.com.
