హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక హరితహారం పథకం మరో మైలురాయిని సాధించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ విడుదల చేసిన తాజా పుస్తకంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.
మొత్తం 7,213 పాయింట్లతో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. అడవుల విస్తీర్ణంలో పట్టణ వ్యర్థాల నిర్వహణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఈ ఘనతపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు, హరితహారం విజయానికి ఇది మరో నిదర్శనమని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషితో తెలంగాణలో పచ్చదనం వెల్లివిరుస్తోందన్నారు.
తెలంగాణకు శుభవార్త
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) తెలంగాణ విడుదల చేసిన తాజా పుస్తకం అన్ని భారతీయ రాష్ట్రాలలో మొదటి స్థానంలో నిలిచింది.
దార్శనికతతో కూడిన నాయకత్వానికి, సృజనాత్మకతకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు… pic.twitter.com/02SSU6rvEm
— కేటీఆర్ (@KTRBRS) జూన్ 4, 2023
“హరితహారం”కి జాతీయ స్థాయి గుర్తింపు. మంత్రి కేటీఆర్ హర్షం appeared first on T News Telugu


