తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా మార్చిన హరితహారం పథకం పేరు మార్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన ఈ హరిత హారం పథకాన్ని అదే పేరు కొనసాగిస్తే అధికార కాంగ్రెస్ కు వచ్చిన నష్టమేమీ లేదు. హరితహారం అంటేనే బీఆర్ఎస్ అని ప్రజల్లో పాతుకుపోయింది. అందుకే ఈ పథకం పేరు మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఇక నుంచి ఈ పథకాన్ని ఏ పేరుతో అమలు చేస్తారన్న దానిపై ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
రాష్ట్ర అటవీ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై త్వరలో జరగనున్న సమావేశంలో కొత్త పేరు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 2024-25 రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో అటవీ శాఖ రూ. 445కోట్లు కేటాయించింది. దీంతో వన్యప్రాణుల దాడుల్లో మరణించినవారికి, గాయపడినవారికి, పశువులను కోల్పోయిన వారికి పరిహారం చెల్లించేందుకు రూ. 2కోట్లు సమాకూర్చాలని అటవీశాఖ అధికారులు ప్రతిపాదించారు.
కాగా గత సర్కార్ పలు రకాల పనులకు రూ.145 కోట్లు ఖర్చు చేసింది. ఫ్లాంటేషన్ డ్రైవ్ తోపాటు హరితహారం కార్యక్రమానికి మొక్కల సరఫరా చేసేందుకు పలు ప్రాంతాల్లో నర్సరీలను పెంచింది. ఈ ఏడాది జూన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 20కోట్ల మొక్కల నాటాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: ప్రాణప్రతిష్ట సందర్బంగా ఎల్ఐసీ కొత్త పాలసీ లాంచ్..జీవితకాల ఆదాయానికి హామీ..!!
