విశాఖ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటుతున్నాడు. రెండో టెస్టులో ఇప్పటివరకు మూడు వికెట్లు తీసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇంగ్లండ్ పై టెస్టు క్రికెట్ లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అశ్విన్ రికార్డును తన పేరుమీద క్రియేట్ చేశాడు. లెజెండరీ లెగ్ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్ ను అశ్విన్ అధిగమించాడు.
విశాఖలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ, వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న భారత్ రెండో టెస్టులో నాలుగవ రోజు రవిచంద్రన్ అశ్విన్ ఈ రికార్డును క్రియేట్ చేశాడు. టెస్ట్ మ్యాచ్ కు ముందు అశ్విన్ రికార్డును బద్దలు కొట్టేందుకు రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ తీయకపోయినప్పటికీ..రెండో ఇన్నింగ్స్ లో ఇప్పటివరకు ముగ్గురు ఇంగ్లండ్ ప్లేయర్స్ ను పెవిలియన్ కు పంపాడు.
రెండో ఇన్నింగ్స్‌లో, మూడో రోజు ఆట ముగిసే సమయానికి షార్ట్ లెగ్ వద్ద క్యాచ్ పట్టిన బెన్ డకెట్ వికెట్‌తో అశ్విన్ అకౌంట్ ఓపెన్ చేశాడు. 4వ రోజు తొలి సెషన్‌లో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 196 పరుగుల అద్భుత నాక్‌తో భారత్‌కు చెమటలు పట్టించిన ఓలీ పోప్ వికెట్ ను అశ్విన్ దీటుగా ఎదుర్కొన్నాడు. ఆఫ్-స్టంప్ వెలుపల అశ్విన్ బౌలింగ్ చేయగా, పోప్ ఆఫ్-సైడ్ ద్వారా కష్టమైన కట్ షార్ట్ ఆడటం కోసం ప్రయత్నించాడు. బ్యాట్ ఎడ్జ్ కు తాకడంలో రోహిత్ శర్మ స్లిప్ అద్భుతమైన క్యాచ్ ను అందుకోవడంతో వికెట్ పడింది.
వైజాగ్ లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచుల్లోనూ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అశ్విన్ చోటు సంపాదించాడు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్ అగ్రస్థానంలోనిలిచాడు. అశ్విన్ తన టెస్టు కెరీర్ లో ఇప్పటివరకు 97 మ్యాచ్ లను ఆడాడు. 2.78 ఎకానమీ రేటుతో 499 వికెట్లుతీశాడు. ఇందులో 34 సార్లు 5 వికెట్లు తీయగా, 8 సార్లు 10 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ భారత జట్టులో బంతితోనే కాకుండా బ్యాట్‌తో కూడా రాణిస్తూ కీలక ప్లేయర్ గా రాణిస్తూ సంచలనం క్రియేట్ చేస్తున్నాడు. 2021లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేశాడు.
ఇది కూడా చదవండి: ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని వేతనాలు చెల్లించిన బైజూస్..!!
