ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు చేయడం కలకలం సృష్టించింది. దీంతో అరెస్ట్ తప్పదన్న వార్తల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. సీఎం తన సతీమణి కల్పనా సోరెన్‌కు పగ్గాలు అప్పజెప్పనున్నారనే వార్తలకు ఇవి బలాన్ని చేకూరుస్తున్నాయి.
దీంతో 20 ఏండ్ల క్రితం బిహార్‌లో జరిగిన విధంగా తన భార్యను సీఎం చేసేందుకు పావులు కదుపుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అప్పటి సీఎం లాలూ ప్రసాద్ దాణా కుంభకోణంలో అరెస్ట్ కావడంతో జులై 25, 1997లో బిహార్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా లాలూ సతీమణి రబ్రీదేవి బాధ్యతలు చేపట్టారు. మరోవైపు కల్పనా సోరెన్ ఎమ్మెల్యే అయ్యేందుకు వీలుగా జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ జనవరి 2న తన పదవికి రాజీనామా చేయడం, కల్పనా ఇక్కడినుంచే పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read.. బస్సు నడుపుతుండగా గుండెపోటు.. 65 మందిని కాపాడి డ్రైవర్ మృతి!
The post హేమంత్ సతీమణి కల్పనా సోరెన్‌కు సీఎం పగ్గాలు! appeared first on tnewstelugu.com.
