హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలుచోట్ల వడగండ్ల వర్షం కురుస్తుండగా… బోయినపల్లి, తిరుమలగిరి, చంపాపేట్, సరూర్‌నగర్, చైతన్యపురి, అల్వాల్, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, చిలకలగూడ, రామాంతపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, మారేడుపల్లితోపాటు పలుచోట్ల ఈదురుగాలులు వీస్తున్నాయి.
ఈదురు గాలులకు హైకోర్టు సమీపంలో చెట్టు కూలడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో ఆ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. నగరం అంతటా వర్షం కురవడంతో ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం లభించేలా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడిందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు.
The post హైదరాబాద్ వడగళ్ల వాన, ఈదురు గాలులు appeared first on T News Telugu.
