
నకిలీ డబ్బులు కాజేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను షాబాద్ పోలీసులు ఈరోజు (శనివారం) అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి మొత్తం రూ. 1.1 లక్షల రూపాయల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు చెందిన తొమండ్ర రంజిత్‌సింగ్, కొవ్వూరుకు చెందిన మలస్ల మోహన్‌రావులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా స్వయంగా నకిలీ నోట్లను తయారుచేస్తున్నట్లు సమాచారం. రూపాయి 50, 100, 200, 500 నోట్లను ముద్రించినట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలతో పాటు రద్దీగా ఉండే దుకాణాల్లో రాత్రి వేళల్లో నకిలీ నోట్లను మారుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని తమ ఏజెంట్లకు 1:3 నిష్పత్తిలో ముద్రించిన దొంగనోట్లను పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
