హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, ప్రగతినగర్, మూసాపేట, బాచుపల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, సూరారం, షాపూర్‌నగర్, చింతల్, జగద్గిరిగుట్ట, మల్కాజిగిరిలో వర్షం కురుస్తోంది.
మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో పిడుగులు, వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
